తెలుగు భీభత్సం
ఇప్పుడే రానారె బ్లాగులో గీర్వాణి వాక్కులు చదివి బయటికొచ్చాను.
ఇంతలోనే అలాంటి దెబ్బ నాకూ తగుల్తుందని అనుకోలేదు.
ఇంత కంగాళీ అవకతవక తెలుగు వచనం నా జన్మలో చదవలేదు!
తెలుగులో మహాకవి, కవిరాజ బిరుదాంకితుడు, ఉద్దండ పండితుడు, ఆధునిక ఆలోచనాపరుడు, వెరసి ఒక గొప్ప తెలుగు వ్యక్తిని స్మరించుకుంటూ ఇటువంటి దారుణమైన భాష చదవాల్సి రావటం మరీ బాధాకరం.
కొన్ని మచ్చుతునకలు:
అకుంటిత దీక్షాపరులైన
గ్రామ మునిసిఫ్
సంస్కృతాంధ్రలో కొంత ప్రవేశమున్నది
ద్రాక్షాపకము
బ్రహ్మణలే
ఆంధ్రలోకము హర్ష పులికాంకితమైనది
పోనీ ఇవి అప్పుతచ్చులనుకుందాం .. ఐతే మరి ..
వీని భావమేమి తిరుమలేశ?
అంధ్ర (రామ రామ!) దేశములో గజారోహణ మహత్యము అనగా నోబుల్ బహుమతి నొందునన్నమాట
ఇనుముకు చెదలు పట్టినట్లు
ఆయన జీవితము నారికేళ పాకముగా తోచెడిది.
తెలుగుతల్లి ఒడిలో విరబూసిన కుసుమము
వార్తా "కదనాలు"
బహుమతి "ప్రధానాలు"
వాళ్ళ పిండాకూళ్ళు
మన ఖర్మలు!
